✅ తల్లికి వందనం 2025 అర్హుల జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయో తెలుసా? | Thalliki Vandanam Final List 2025 and New Payment Date
తల్లికి వందనం పథకానికి సంబంధించి విద్యార్థుల వివరాలు, పేర్లు ఇంకా అనేక ప్రశ్నలు తల్లులు మరియు తండ్రుల్లో కలుగుతున్నాయి. ముఖ్యంగా అంగన్వాడీ నుంచి 1వ తరగతికి చేరే పిల్లలు, మరియు 10వ తరగతి పూర్తిచేసి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రారంభించే విద్యార్థుల పేర్లు ప్రస్తుతం అర్హుల జాబితాలో కనిపించడం లేదు.
అయితే, ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం – ఈ విద్యార్థుల నమోదు ప్రక్రియ జూన్ 21 నుంచి 26 వరకు కొనసాగనుంది. అనంతరం తుది అర్హుల జాబితా జూన్ 30న విడుదల కానుంది. ఈ జాబితాలో వీరి పేర్లు ఉండే అవకాశం 100% ఉంటుంది.
✅ తల్లికి వందనం 2025 ముఖ్యమైన తేదీలు & అర్హతలు
అంశం | వివరాలు |
---|---|
జాబితాలో చేర్చే విద్యార్థులు | అంగన్వాడీ నుంచి 1వ తరగతికి, 10వ తరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం |
నమోదు తేదీలు | జూన్ 21 – జూన్ 26, 2025 |
తుది జాబితా విడుదల | జూన్ 30, 2025 |
అమౌంట్ జమ తేది | జూలై 5, 2025 తర్వాత |
తల్లికి వందనం వర్తించదు | ఇంటర్ 2వ సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులకు (వారు విద్యదీవెనలోకి మారతారు) |
📌 ఈ సంవత్సరం ఎవరికి వర్తించదు?
తల్లికి వందనం 2025 పథకం ఇంటర్ 2వ సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులకు వర్తించదు. ఎందుకంటే వారు ఇప్పటికే విద్యదీవెన పథకం పరిధిలోకి వస్తారు. కనుక వారు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందలేరు.
Tags: తల్లికి వందనం 2025 అర్హుల జాబితా, తల్లికి వందనం జాబితా తేదీలు, తల్లికి వందనం జాబితా తేదీలు, AP Government welfare schemes 2025, Amma Vodi vs Thalliki Vandanam, Thalliki Vandanam payment status, Thalliki Vandanam final list download, Inter students scheme eligibility Andhra Pradesh, talliki-vandanam
, ap-government-schemes
, student-benefit-schemes
, amma-vodi
, final-eligibility-list-2025
, inter-students-benefits
, ap7pm-latest